కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బిజ్నోర్ జిల్లా, నగీనా సమీపంలోని నంద్పూర్ గ్రామంలో ఉన్న పురాతన ఆంజనేయుడి ఆలయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఓ వీధి కుక్క హనుమంతుడి విగ్రహం చుట్టూ భక్తిపూర్వకంగా ప్రదక్షిణలు (Hanuman Pradakshina) చేస్తూ ఉంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి భక్తులను ఆకర్షిస్తోంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారు జామున సుమారు 4 గంటలకు ఈ కుక్కను మొదటిసారి విగ్రహం చుట్టూ తిరుగుతుండటం గమనించారు. అప్పటి నుంచి ఇది దాదాపు 36 నుంచి 48 గంటల పాటు నిరంతరంగా, ఎలాంటి ఆటంకం లేకుండా విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది.
కుక్క అలసట లేకుండా, భయం లేకుండా శ్రద్ధా భక్తులతో ప్రదక్షిణలు (Hanuman Pradakshina) చేస్తుండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఆలయ పూజారి కొంచెం ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే కొద్దిసేపు ఆగి తిన్న తరువాత మళ్లీ ప్రదక్షిణ చేయడం మొదలుపెడుతోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివెళ్తున్నారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జంతువుల్లో కూడా దైవ భక్తి ఉండొచ్చని, మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఆధ్యాత్మిక సంబంధం ఉందని భక్తులు చెబుతున్నారు.
View this post on Instagram
Read Also: ఎల్లమ్మ సినిమా అప్డేట్ ఇచ్చిన బలగం వేణు
Follow Us On: Instagram


