కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పాలనా విధానాలు, చట్టాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను (Sarpanch Training Program) నిర్వహించనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విడతల వారీగా జిల్లాల స్థాయిలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (TGIRD) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరాల్లో ఒక్కో విడత 5 రోజుల పాటు ఉంటుంది.
రెండేళ్ల తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు ఎన్నికైన నేపథ్యంలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు (Sarpanch Training Program) ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొత్తం సుమారు 12,760 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు పల్లెపాలన, పంచాయతీరాజ్ చట్టాలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి పథకాలు వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాల వారీగా శిక్షణా కేంద్రాలు, రిసోర్స్ పర్సన్లు, సమావేశాల షెడ్యూల్ను ప్రభుత్వం సిద్ధం చేసింది.
Read Also: లండన్లో పాక్ ముఠా అరాచకం.. సిక్కు మైనర్ బాలిక గ్యాంగ్ రేప్
Follow Us On: X(Twitter)


