epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్: అధికారుల ఏర్పాట్లు

కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈనెల 18న ఖమ్మం జిల్లాలో (Khammam) పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో (CP Sunil Dutt) కలిసి క్షేత్రస్థాయిలో భద్రత, ఏర్పాట్లను బుధవారం పర్యవేక్షించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి ప్రాంతాల్లో జరగనున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ వేదికలను వారు పరిశీలించారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాలో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: మల్లన్న పార్టీకి ఈసీ కేటాయించిన గుర్తు ఇదే..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>