కలం, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం (Dummugudem) మండలం ఒక అరుదైన వేడుకకు వేదికైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల వారు ఒకే చోట చేరి సందడి చేశారు. సుమారు 192 మంది కుటుంబ సభ్యులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని తమ అనుబంధాన్ని చాటుకున్నారు.
మారుతున్న కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న తరుణంలో, ఇంత మంది బంధువులు ఒకే దగ్గర చేరడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. వృద్ధుల నుంచి పసిపిల్లల వరకు అందరూ కలిసి పండుగ జరుపుకోవడంతో దుమ్ముగూడెం (Dummugudem)లో పండుగ వాతావరణం రెట్టింపయ్యింది. వృత్తి, వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పండుగ వేళ కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
Read Also: జర్నలిస్టులపై కేసులు.. మైలేజ్ బాటలో రాజకీయ పార్టీలు
Follow Us On: X(Twitter)


