కలం, సినిమా : ఈ సంక్రాంతి పండుగ మెగా ఫ్యామిలీకి (Mega Family) ఎంతో స్పెషల్ అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన లేటెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” తాజాగా రిలీజ్ అయి సూపర్‌హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భోగి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంది. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి దోశలు వేసుకున్నారు.
వైష్ణవ్ తేజ్, రాంచరణ్, వరుణ్ -లావణ్య, సుస్మితా దోశలు వేస్తుండగా.. ఇది భోగిలా లేదు దోశ రోజుగా ఉంది. మా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి మన సాంప్రదాయాలను, పండుగలను ఎంతో అద్భుతంగా జరుపుకుంటామని మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సోషల్‌మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్‌గా మారింది. గతంలో కూడా భోగి రోజు మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరగా.. మెగాస్టార్ దోశలు వేసిన వీడియో బాగా వైరల్ అయింది.
Read Also: ఎల్లమ్మ సినిమా అప్డేట్ ఇచ్చిన బలగం వేణు
Follow Us On: Sharechat


