epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గోదా రంగనాథ కల్యాణం.. పాల్గొన్న దిల్‌ రాజు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో గోదా రంగనాథ కల్యాణం (Godha Ranganatha Kalyanam) కన్నుల పండువగా జరిగింది. అమ్మవారి కల్యాణ వేడుకల్లో నిర్మాత దిల్ రాజు (Dil Raju) దంపతులు పాల్గొన్నారు. గోదా కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో శ్రీ వ్రతం చేసి రంగానాథుడిని కల్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం మనకు వైకుంఠ నాధుడిని హృదయానికి చేరువ చేస్తుందని అన్నారు.

గ్రామస్థులు చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, విజయ్ స్వామి, ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు దంపతులు, నర్సింహ రెడ్డి దంపతులు, నర్సారెడ్డి, రమేశ్‌, నరాల సుధాకర్ దంపతులు, ప్రసాద్ భాస్కర్, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Dil Raju
Dil Raju

Read Also: మెగా ఫ్యామిలీ భోగి సెలెబ్రేషన్స్.. నిహారిక పోస్ట్ వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>