కలం వెబ్ డెస్క్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ(Producer Naga Vamsi). ఈ యంగ్ ప్రొడ్యూసర్ తన సినిమాలతోనే కాదు తన బోల్డ్ స్టేట్ మెంట్స్ తో కూడా పాపులర్ అయ్యారు. నాగవంశీ నిర్మించిన రీసెంట్ మూవీ అనగనగ ఒక రాజు (Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. నిన్నే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ప్రీమియర్స్ నుంచి హిట్ టాక్ వచ్చింది.
అలాగే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మరోవైపు క్రిటిక్స్ కూడా మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. దీంతో అనగనగ ఒక రాజు సినిమా టాక్ పరంగా ఈ పండగ సినిమాల్లో మన శంకరవరప్రసాద్ గారుతో జాయిన్ అయ్యిందని అనుకోవాలి. ఈ సక్సెస్ టాక్ నేపథ్యంలో నాగవంశీ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. 10 నెలల తర్వాత ఒక గుడ్ న్యూస్ విన్నానని ట్వీట్ చేశారు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ ట్విట్టర్ అక్కౌంట్ లో పోస్ట్ చేసిన పండుగ స్టార్ట్ అయ్యిందనే ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అనగనగ ఒక రాజు సినిమాతో తమ సంస్థకు మరో హిట్ పడిందనే సంతోషం నాగవంశీలో కనిపిస్తోంది. గతంలో వార్ 2 సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి కొంత డిస్ట్రబ్ అయ్యారు నాగవంశీ. ఆ చికాకును సంక్రాంతికి దక్కిన విజయం పోగొట్టిందని అనుకోవచ్చు.


