కలం, వెబ్ డెస్క్: ఒకవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే.. మరోవైపు ఇండియాలోకి అక్రమంగా బంగ్లాదేశీయులు ప్రవేశిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై (Mumbai) లోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద 38 ఏళ్ల మహిళను చేసి, విదేశీయుల చట్టం కింద కేసు ఆమెపై నమోదు చేశారు.
బంగ్లాదేశ్ మహిళ ఎలాంటి పత్రాలు లేకుండా తిరుగాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆమెను విచారించగా ‘నా పేరు జులేఖా జమాల్ షేక్. ముంబైలో ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నా’ అని చెప్పింది. గతేడాది ఆగస్టులోనే మనదేశ అధికారులు ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించారు. కొంతకాలం తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న అడవుల గుండా ప్రయాణించి తిరిగి ఇండియాలోకి (India) ప్రవేశించింది. 30 ఏళ్ల బిల్కిస్ బేగం సిర్మియా ఇండియాలోకి ప్రవేశించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోడంతో అరెస్ట్ చేశారు.


