epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏఐ హెల్మెట్.. ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేస్తే అంతే!

కలం, వెబ్​డెస్క్​: ట్రాఫిక్​ సిబ్బంది ఎవరూ లేరని సిగ్నల్స్​ జంప్​ చేస్తున్నారా? సీసీ కెమెరాలు లేవని సర్రున దూసుకెళుతున్నారా? చౌరస్తాలో పనిచేయని సిగ్నల్స్​ను చూసి ఇదే సందని రయ్​ మంటూ వెళ్లిపోతున్నారా? స్పీడ్​ లిమిట్​ను క్రాస్​ చేస్తున్నారా? ఇష్టమొచ్చినట్లు ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేస్తున్నారా? ఎవరూ చూడలేదు.. ఏ కెమెరాకూ దొరకలేదు అని ధీమాగా ఉన్నారా? అయితే.. ఇది మీ కోసమే. ఎందుకంటే త్వరలోనే ఏఐ ఆధారిత హెల్మెట్ (AI Helmet)​ మార్కెట్​లోకి రాబోతోంది మరి.

ట్రాఫిక్​ సిబ్బంది, సీసీ కెమెరాలు లేకున్నా.. మీ వెనకనో పక్కనో వచ్చే వ్యక్తి పెట్టుకున్నహెల్మెట్​ అంతా రికార్డు చేసి క్షణాల్లో దగ్గరలోని పోలీస్​ స్టేషన్​కు పంపుతుంది. అలాంటి ఏఐ హెల్మెట్​ ​ను తయారుచేశారు బెంగళూరుకు (Bengaluru) చెందిన టెకీ పంకజ్ తన్వర్ (Pankaj Tanwar)​. ఈ హెల్మెట్​ గురించి అతను చేసిన పోస్ట్​ వైరల్​ అయ్యి బెంగుళూరు పోలీసులకు చేరడంతో, వాళ్లు అతడిని పిలిపించి మాట్లాడారు. హెల్మెట్​ గురించి తెలుసుకున్నారు. అందులోని వాడిన టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్​ సిబ్బందికి ఏఐ హెల్మెట్​లు ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారని టెకీ ‘ఎక్స్​’లో చేసిన పోస్ట్​ వైరల్​ అయ్యింది.

ఏఐ హెల్మెట్​ ఏం చేస్తుందంటే..

తాను రూపొందించిన ఏఐ హెల్మెట్ (AI Helmet)​ ఎలా పనిచేస్తుందో తన్వర్ బైక్​ రైడ్​ చేస్తూ ప్రాక్టికల్​గా వివరించాడు. ఇది రియల్​ టైమ్​లో పనిచేసే హెల్మెట్​. అంటే బైక్​ రైడర్​తోపాటు హెల్మెట్​లోని ఏఐ ఏజెంట్​ కూడా సమాంతరంగా పనిచేస్తుంటాడన్నమాట. అంటే బైక్​ నడిపేటపుడు మన చుట్టుపక్కల ఎవరైనా ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేస్తే ఏఐ ఏజెంట్​ వెంటనే పసిగట్టేస్తాడు. ఈ ఏఐ ఏజెంట్​.. ట్రాఫిక్​ రూల్స్​ను అతిక్రమించే వాళ్లను గుర్తించడమే కాదు, ఆధారాలతో సహా వాళ్ల వివరాలను పోలీస్​ స్టేషన్​కు వెంటనే పంపిస్తాడు. దీంతో పోలీసుల పని సులువు అవుతుంది. ఇది మార్కెట్​లోకి వస్తే ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేసేవాళ్లకు చలానా మోత మోగడం ఖాయం. కాగా, ఈ హెల్మెట్​ను బిజినెస్​ కోసం కాదని, సమాజంపై బాధ్యతతో రూపొందించినట్లు తన్వర్​ చెబుతున్నారు.

Read Also: బీజేపీ కొత్త చీఫ్‌గా నితిన్ నబిన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>