కలం, సినిమా : మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నుంచి మూవీ వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. వరుసగా కథలు వింటున్నా ఏదీ నచ్చడం లేదని తెలుస్తుంది. నేడు(జనవరి 13) వైష్ణవ్ తేజ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అయినా అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటే ఆ ఊసే లేదు. ఉప్పెన మూవీతో.. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. ఉప్పెన తర్వాత నటించిన కొండపొలం (Konda Polam), రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో.. నెక్ట్స్ ఏ కథతో సినిమా చేయాలి అనేది తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.
ఆ మధ్య పరశురామ్ వైష్ణవ్ తేజ్‌కు ఓ కథ చెప్పాడని, ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్ గా డైరెక్టర్ విక్రమ్ కుమార్ (Vikram Kumar) పేరు వినిపించింది. వీరి కాంబినేషన్లో మూవీకి సంబంధించి అఫిషియల్‌గా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ప్రవీణ్ సత్తారుతో తేజ్ మూవీ ఫిక్స్ అంటూ కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఈ కాంబో గురించి కూడా అప్డేట్ లేదు. దీంతో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది.

Read Also: ప్రభాస్ సపోర్ట్‌గా నిలిచారు : మారుతి
Follow Us On: Sharechat


