epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

’మన శంకరవరప్రసాద్ గారు‘ డే 1 కలెక్షన్లు ఎంతంటే..

కలం, సినిమా:  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు‘ (Mana Shankara Vara Prasad Garu) సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు డే 1 అదిరే కలెక్షన్స్ దక్కాయి. వరల్డ్ వైడ్ 84 కోట్ల రూపాయలతో హ్యూజ్ ఓపెనింగ్స్ రాబట్టిందీ సినిమా. రూ. 84 కోట్ల రూపాయల వసూళ్లు మొదటి రోజే వచ్చాయంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసిందనే అనుకోవాలి. సినిమా బాగుందనే టాక్ రావడంతో బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఈ సినిమాకు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో దాదాపు 5 లక్షల టికెట్ సేల్స్ జరగడం విశేషం.

ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ సంక్రాంతి హాలీడేస్ సీజన్‌లో ‘మన శంకరవరప్రసాద్ గారు‘ (Mana Shankara Vara Prasad Garu) సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉండటం కలిసొచ్చే విషయం. ఒక ఫ్యామిలీ సినిమా చూస్తే కనీసం నాలుగైదు టికెట్స్ కొంటారు. అలా ఫ్యామిలీ ఆడియెన్స్ ను రప్పించగలిగే కంటెంట్ ఉండటం ఈ మెగా మూవీకి అడ్వాంటేజ్‌గా నిలుస్తోంది.

మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ విషయంలో మెగాస్టార్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ చిత్రాన్ని చూస్తున్నారు. రామ్ చరణ్ తన పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి మన శంకరవరప్రసాద్ గారు సినిమాను చూశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిని రామ్ చరణ్ అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అనిల్, చరణ్ కాంబో మెగాభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి.. ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>