కలం, మెదక్ బ్యూరో: ఉల్లి రైతులు రోడ్డెక్కారు. తమకు గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉల్లి రైతులు (Onion Farmers) ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు తీవ్రంగా పడిపోవడంతో పెట్టుబడి పైసలు కూడా రావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకొని ఉల్లి పంటకు సరైన మద్దతు ధరను ప్రకటించాలని కోరారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉల్లి రైతులు హెచ్చరించారు.

Read Also: జిల్లా, మండలాల మార్పుకు బ్రేక్ !
Follow Us On: Sharechat


