కలం, మెదక్ బ్యూరో: మంత్రి వివేక్ (Minister Vivek) వెంకటస్వామికి నిరసన సెగ ఎదురైంది. ‘రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రుణమాఫీ ఎప్పుడు చేస్తారు?’ అంటూ రైతులు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గపరిధిలో మంత్రి వివేక్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కాన్వాయ్‌ని రైతులు అడ్డుకున్నారు. రైతు భరోసా, రుణమాఫీ రాలేదని రైతులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. దీంతో రైతుల దగ్గరకు వెళ్లి మంత్రి వివేక్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
రైతు భరోసా విషయంలో రైతులకు స్పష్టత లేదు. సంక్రాంతి లోపు ఇస్తామని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో రైతులు ఎదురుచూస్తున్నారు.

Read Also: ఇరాన్లో ఆగని హింస.. 2వేల మంది మృతి
Follow Us On : WhatsApp


