కలం వెబ్ డెస్క్ : పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్(Polavaram-Nallamala Sagar Project) విషయంలో తెలంగాణ హక్కులు కాపాడేందుకు ప్రయత్నిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం సుప్రీం కోర్ట్(Supreme Court) తీర్పు విన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్‌తో ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనేక ఉల్లంఘటనలకు పాల్పడుతుందని ఆరోపించారు. గతంలో పర్యావరణ, అటవీ శాఖ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను కూడా అమలు చేయలేదని సుప్రీం కోర్ట్ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన 484.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అయితే డీపీఆర్ ప్రిపరేషన్‌కు సీడబ్య్లూసీ అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. ఇది పూర్తిగా ఆపాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్‌లు, జలశక్తి మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు లేకుండానే ముందుకు పోతోందని తెలిపారు.


