కలం డెస్క్: మహిళా ఐఏఎస్ (Woman IAS) అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలను, కథనాలను ప్రసారం చేసినందుకు టీవీ ఛానెళ్ళు (Telugu News Channels), సోషల్ మీడియా అకౌంట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు జనవరి 10న మూడు చట్టాల సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మహిళ ప్రతిష్టకు భంగం కలిగించే చట్టాల ప్రకారం తొమ్మిది మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్‌టీవీ ఛానెల్ యాజమాన్యం, ఎడిటర్, యాంకర్, రిపోర్టర్, ఆ ఛానెల్ తరఫున నడిచే సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకోనున్నట్లు ఎఫ్ఐఆర్ పేర్కొన్నది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఈ కథనాలు హరిస్తున్నాయని ఆ ఫిర్యాదులో జయేశ్‌రంజన్ పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్న మీడియా సంస్థలు :
ఎన్టీవీ (తెలుగు న్యూస్ ఛానెల్)
తెలుగు స్క్రైబ్
ఎంఆర్ మీడియా తెలంగాణ
ప్రైమ్ 9 తెలంగాణ (టీవీ ఛానెల్)
పీవీ న్యూస్
సిగ్నల్ టీవీ
ఓల్గా టైమ్స్
మిర్రర్ టీవై అఫిషియల్
టీ-న్యూస్ తెలుగు
Read Also: మిమ్మల్ని చూస్తేనే జాలేస్తుంది.. హరీశ్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్!
Follow Us On: Sharechat


