epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు వారిద్దరూ దూరం..!

క‌లం వెబ్ డెస్క్ : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్(India) ఘన విజయం సాధించినప్పటికీ కొందరి ప్రదర్శన ఆశించినంతగా లేదు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ ఒక ఓవరు మిగిలి ఉండగానే 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్(New Zealand) గట్టి పోటీ ఇవ్వగా, చివర్లో కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా టీమిండియాను గట్టెక్కించారు. అయితే బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ(Prasidh Krishna).. రెండు వికెట్లు తీసినప్పటికీ పరుగులు భారీ ఇచ్చుకున్నాడు. దాంతో రెండో వన్డేకు అతడిపై వేటు పడింది. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వవచ్చని సమాచారం.

అతడితో పాటు వాషింగ్ట‌న్‌ సుందర్‌(Washington Sundar) కూడా రెండో వన్డేకు దూరం కానున్నాడు. తొలి వన్డేలో గాయపడిన వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి లేదా షెహ్‌బాజ్ అహ్మద్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మిగతా కాంబినేషన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అయితే జడేజా స్థానం ఇంకా పదిలం కాలేదు. తొలి వన్డేలో నిరాశ పరిచిన ప్లేయర్లలో జడేజా కూడా ఒకడు. దీంతో రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అదే విధంగా సిరాజ్, కుల్దీప్ నుంచి మరింత మెరుగైన బౌలింగ్ ఆశిస్తున్నారు. అర్ష్‌దీప్ రీఎంట్రీతో టీమిండియా బౌలింగ్ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్‌కు మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చే అవకాశముంది. రాజ్‌కోట్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>