కలం, వెబ్ డెస్క్: గత నెల 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 47 మంది మృతి విషయం తెలిసిందే. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సిట్ అధికారులు తమకు వ్యతిరేకంగా విచారణ జరుపుతున్నారన్న టీవీకే పార్టీ న్యాయవాదుల వాదనలు విని సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో సోమవారం ఢిల్లీలో సీబీఐ (CBI) ముందు విచారణకు విజయ్ హాజరుకానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరుకావాలని విజయ్‌కు ఆరు రోజుల క్రితం సీబీఐ సమన్లు జారీ చేసింది. సీబీఐ విజయ్‌ను అరెస్ట్ చేయనుందనే ప్రచారం నేపథ్యంలో ఈ విచారణను ఎదుర్కోబోతుండటంతో ఆందోళన నెలకొంది.


