కలం వెబ్ డెస్క్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం(Medaram) మహాజాతరకు ముందే జనసంద్రంగా మారింది. తెలంగాణ కుంభమేళా(Telangana Kumbh Mela)గా పేరుగాంచిన మేడారం జాతరలో అమ్మవార్లను వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి సమ్మక్క, సారక్కలను దర్శించుకుంటున్నారు. భారీ ఎత్తున వాహనాలు వస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరుగనుంది. దీనికి ముందే ఊహించని రీతిలో మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారంలో అమ్మవార్ల గద్దెల వద్ద పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర మంత్రులు మేడారాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.


