కలం వెబ్ డెస్క్ : ప్రతి ఒక్కరికీ ఏదో సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్స్ కాస్త ఎక్కువుగానే ఉంటాయి. అలాగే కొంత మందికి.. కొన్ని అక్షరాలతో టైటిల్ పెడితే సెట్ అవుతుంది. కొంతమందికి సెట్ కాదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ‘అ’ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేలా టైటిల్ పెట్టడం సెంటిమెంట్ గా మారింది. వెంకీకి.. సినిమా టైటిల్ ఎండింగ్ లో ‘రా’ అని పెట్టడం సెంటిమెంట్‌గా ఉండేది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సెంటిమెంట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇంతకీ.. ఏంటా సెంటిమెంట్..?
ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలాగే లారెన్స్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన రెబల్(Rebel) మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈమధ్య కాలంలో.. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్(Radhe Shyam) కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ నటించిన హర్రర్ మూవీ రాజాసాబ్(Rajasaab) కూడా డివైడ్ టాక్‌తో రన్ అవుతుంది. ఇదంతా చూస్తుంటే.. ఇంగ్లీషు అక్షరం ‘ఆర్’ తో టైటిల్ పెట్టడం ప్రభాస్ కు కలిసి రాలేదా..? ఈ బ్యాక్ సెంటిమెంట్ వలనే.. రాజాసాబ్‌కు ఇలాంటి టాక్ వచ్చిందా? అని అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుంది.
అయితే.. సినిమాలో కథ బలంగా ఉంటే.. టైటిల్ ఏం పెట్టారు..? ఏ ఇంగ్లీషు అక్షరంతో పెట్టారు..? అనేది ఎవరూ పట్టించుకోరు. పైన చెప్పుకున్న రాఘవేంద్ర, రెబల్, రాధేశ్యామ్, రాజాసాబ్ చిత్రాల్లో బలమైన కథ లేకపోవడమే లోపం కానీ.. ఈ సెంటిమెంట్ కాదనే చర్చ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా ఇక నుంచి ప్రభాస్ ఆర్ అనే ఇంగ్లీషు అక్షరంతో టైటిల్ పెట్టే ముందు బాగా ఆలోచిస్తే బెటర్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. ప్రభాస్ దీనిని ఎంత వరకు పట్టించుకుంటారో చూడాలి.


