కలం వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో సంచలన పోస్ట్ చేశారు. తన ఫోటో ఒకటి పోస్ట్ చేసి తను “వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వెనెజువెలా(Venezuela)లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్‌లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల అమెరికా సైనిక చర్యల్లో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro), ఆయన భార్య సీలియా ఫ్లొరస్‌ను అక్రమంగా అమెరికాకు తీసుకొచ్చారు. ఈ చర్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. వెనెజువెలాలో మదురోకు మద్దతుగా భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఆ దేశ చట్ట ప్రకారం మదురో అధిష్టానం విడిచి ఉన్నందున ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్(Delcy Rodriguez)ను దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ న్యాయస్థానం నియమించింది. ఆమె అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసి పాలన బాధ్యతలు చేపట్టారు. ఇక ట్రంప్ పోస్ట్ చేసిన ఫోటో, ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


