కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని బోరబండ(Borabanda)లో ఓ యువతి దారుణంగా హత్య(Murder)కు గురైంది. స్నేహం పేరుతో దగ్గరైన ఓ యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన ఫాతీమా బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో తనకు పబ్‌లో జహీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొద్దిరోజులకు స్నేహంగా మారి ఇద్దరూ బాగా మాట్లాడుకునేవారు. కొద్ది రోజుల క్రితం ఫాతీమా ఆ పబ్‌లో పని మానేసి మరో పబ్‌లో పనికి చేరింది. అప్పటి నుంచి జహీర్ తో మాట్లాడటం తగ్గించింది. దీంతో కోపం పెంచుకున్న జహీర్ ఆదివారం ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుకుందామని పిలిపించాడు. ఫాతీమా తన వద్దకు వచ్చాక మాటామాటా పెరిగి ఆవేశంతో ఆమెను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని జహీర్ ను అదుపులోకి తీసుకున్నారు.


