కలం వెబ్ డెస్క్ : దేశంలో చలి తీవ్రత(Cold intensity) రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఏకంగా సున్నా కంటే తక్కువ డిగ్రీలు నమోదవుతున్నాయి. శ్రీనగర్(Srinagar) రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో శ్రీనగర్‌లోని దాల్ సరస్సు(Dal Lake) పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలు నమోదవుతున్నాయి. వాహనాల రాకపోకలకు, ప్రజల రోజూవారీ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కమలం రైతుల కష్టాలు
కాశ్మీర్‌లోని దాల్ సరస్సు గడ్డ కట్టడంతో కమలాలు సాగు చేసే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ జీవనాధారానని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గడం, పంటకు ఆరోగ్య సమస్యలు పెరగడం, పని పరిస్థితులు మరింత కఠినంగా మారడం వల్ల తమ వృత్తి ప్రమాదంలో పడిందని చెప్తున్నారు. ఈ కాలంలో కాశ్మీర్‌లో రైతులు తెల్లవారుజామునే సరస్సులోకి దిగుతారు. మంచు గడ్డ కట్టేంత చలిలో, నీటిలో మునిగి మట్టిలో దాగి ఉన్న కమలకాండలను చేతులతోనే తవ్వి బయటకు తీస్తారు. గంటల తరబడి చలిలో పని చేయాల్సి వస్తోంది. కానీ గతంలో లభించిన పంట ఇప్పుడు దొరకడం కష్టమైపోయింది.


