కలం, వెబ్ డెస్క్: పదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని అయ్యప్ప స్వాములు (Ayyappa Devotees) వినూత్న కార్యక్రమం చేపట్టారు. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి, ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను అయ్యప్ప స్వాములు ప్రదర్శించారు. పదేళ్లు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప మాల ధరించిన మెట్టు సాయి కుమార్ మిత్ర బృందం ఈ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఉన్న మెట్టు సాయి కుమార్ సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్‌పై అభిమానం చాటుకుంటు వస్తున్నారు. గతంలో రేవంత్ (CM Revanth Reddy) జన్మదినం సందర్భంగా ఆయన సన్నబియ్యంతో శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


