epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏపీకి మరో హైదరాబాద్​ అవసరం : వెంకయ్యనాయుడు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాజధాని హైదరాబాద్​ బ్రహ్మాండమైన నగరం అని.. అలాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్​ కు కూడా చాలా అవసరం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్​ ముచ్చింతల్​ లోని స్వర్ణభారత్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలపై ఆయన స్పందించారు. పిల్లలకు కేవలం రాజకీయ వారసత్వం ఇవ్వడం మాత్రమే సరైంది కాదని, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలన్న బాధ్యత ఇవ్వాలన్నారు.

రాజకీయాల్లో తన కొడుకు, కూతురుని తీసుకుని రావడం పట్ల తనకు ఆసక్తి లేదని చెప్పారు.సేవ ద్వారానే మంచిపేరు తెచ్చుకుంటారని అందుకే స్వర్ణ భారత్​ ట్రస్ట్​ సేవలో తన వారసులు కొనసాగుతున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని ఎన్ని మార్పులు వచ్చినా భారతీయ మూలాలు మాత్రం మర్చిపోకూడదని ఆయన సూచించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూనే ఉండాలని Venkaiah Naidu తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>