epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రన్నరప్​ నిహాల్​, వంతిక.. అర్జున్​ ఇరిగేశికి థర్డ్​ ప్లేస్​

కలం, వెబ్​డెస్క్​: టాటా స్టీల్​ చెస్ (Tata Steel Chess)​ ఇండియా బ్లిట్జ్​ చెస్​ టోర్నీలో భారత్​కు నిరాశ. ఓపెన్​ కేటగిరిలో ఆదివారం జరిగిన పురుషుల, మహిళల విభాగంలో మన క్రీడాకారులు రన్నరప్​తో సరిపెట్టుకున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ అమెరికా క్రీడాకారులు టైటిల్స్​ నెగ్గారు. పురుషుల విభాగం ఓపెన్​ కేటగిరీలో అమెరికన్​ గ్రాండ్​ మాస్టర్​ వెస్లీ సో 12 పాయింట్లతో విజేతగా నిలిచాడు. భారత గ్రాండ్​మాస్టర్​ నిహాల్​ సరిన్ 11 పాయింట్లతో రన్నరప్​గా నిలిచాడు. మరో భారత ఆటగాడు, తెలంగాణకు చెందిన అర్జున్​ ఇరిగేశి (Arjun Erigaisi) కి కూడా 11 పాయింట్లే వచ్చినప్పటికీ టైబ్రేక్​లో వెనకబడి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మాజీ ప్రపంచ ఛాంపియన్​ విశ్వనాథన్​ ఆనంద్​ ఎనిమిదో స్థానం పొందాడు. ఇక మహిళల విభాగంలో అమెరికా క్రీడాకారిణి కరిస్సా ఇప్​ టైటిల్​ దక్కించుకుంది. ఆమెకు భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్​ గట్టి పోటీ ఇచ్చింది. అయితే, టైబ్రేక్​లో తడబడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. కోల్​కతా వేదికగా టాటా స్టీల్​ చెస్​ (Tata Steel Chess) టోర్నీ జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>