epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సంక్రాంతికి బస్సుల జాతర..

కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranthi) వేళ భాగ్యనగరమంతా దాదాపు ఖాళీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా సొంతూరి బాటపట్టారు. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు సైతం ప్రత్యేక బస్సులు (RTC Special Buses) నడుపుతున్నాయి. ప్రజలు పల్లెటూర్లకు వెళ్లిపోతున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన ఆర్టీసీ భారీగా బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 5,500పైగా బస్సులను నడపాలని టీజీ ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణ జిల్లాలకు 2,500పైగా బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు 3,000పైగా బస్సులను నడుపుతున్నారు. ఇక ఏపీ సైతం 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో కేవలం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచే 2,432 బస్సులు నడవనున్నాయి.

సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ఈసారి ప్రత్యేక బస్సుల్లో (RTC Special Buses) అదనపు బాదుడు లేకుండా సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణం టికెట్లను కలిపి బుక్ చేసుకుంటే మొత్తం టికెట్ ధరపై 10% రాయితీ కల్పిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ప్రత్యేక బస్సులకు 50% అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు, కానీ ఈ ఏడాది సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

2025 సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ మొత్తం 5,806 ప్రత్యేక బస్సులను నడిపింది. ఆర్టీసీకి రూ. 112.46 కోట్లు ఆదాయం సమకూరింది. అత్యధిక ఒకరోజు ఆదాయం సుమారు రూ. 15 కోట్లు (జనవరి 20న) తెలంగాణ ఆర్టీసీకి వచ్చింది. దాదాపుగా 8.50 లక్షల మంది ప్రయాణికులు (ప్రత్యేక ) బస్సుల్లో ప్రయాణించారు. ఏపీఎస్ ఆర్టీసీ గత ఏడాది 9,097 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. మొత్తం ఏపీ ఆర్టీసీకి గత ఏడాది రూ. 150 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక రోజు అత్యధిక ఆదాయం రూ. 23.71 కోట్లు ఏపీఎస్ ఆర్టీసీకి సమకూరింది. దాదాపుగా 11 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

Read Also: సినిమా కలలపై దాడులు.. విజయ్ దేవరకొండ భావోద్వేగం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>