epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేప్​ కేసులో కాంగ్రెస్​ ఎమ్మెల్యే అరెస్ట్​

కలం, వెబ్​డెస్క్​: రేప్​ కేసులో కాంగ్రెస్​ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్​ చేశారు. కేరళ కాంగ్రెస్​కు చెందిన ఎమ్మెల్యే రాహుల్ మమ్​కూటథిల్ ​(Rahul Mamkootathil) పై ఇటీవల అత్యాచార​ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఓ నటి, ఆ తర్వాత మరో యువతి ఆరోపణులు చేయగా, వాటిలో రాహుల్​ ముందస్తు బెయిల్​ తెచ్చుకున్నారు. అయితే, ఇటీవల రాహుల్​పై మరో యువతి ఆరోపణలు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్​ కోసం రాహుల్​ ప్రయత్నాల్లో ఉండగానే ఆదివారం అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పాలక్కాడ్​లోని ఓ హోటల్​లో ఉన్న రాహుల్​ మమ్​కూటథిల్​ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వరుస రేప్​ ఆరోపణలు, కేసుల నేపథ్యంలో రాహుల్​ను ఇంతకుముందే కాంగ్రెస్​ పార్టీ సస్పెండ్​ చేసింది. మరోవైపు రాహుల్​ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో అనే చర్చ కేరళలో నడుస్తోంది.

Rahul Mamkootathil
Rahul Mamkootathil

Read Also: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ శౌర్యయాత్ర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>