కోహ్లీ(Virat Kohli) మరోసారి తన సత్తా చాటాడు. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. 81 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరల రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేల్లో చేజింగ్ చేస్తూ 6000 పరుగులు పూర్తిచేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. మొత్తం 102 ఇన్నింగ్స్‌లలో 89.29తో సగటుతో కోహ్లీ 6,072 పరుగులు చేశాడు. దీంతో సచిన్, సంగక్కర రికార్డులను బద్దలు కొట్టాడు.
సచిన్(Sachin Tendulkar) 232 ఇన్నింగ్స్‌లో 69 సార్లు 50+ పరుగులు చేశాడు. కోహ్లీ(Virat Kohli) 161 ఇన్నింగ్స్‌లో 70 సార్లు 50+ పరుగులు చేశాడు. 153 ఇన్నింగ్స్‌లో 55సార్లు 50+ పరుగులు చేసిన రోహిత్ ఈ జాబితో మూడో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా వన్డే హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో 463 మ్యాచ్‌లలో 44.83 సగటుతో 18,426 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. 305 మ్యాచ్‌లలో 57.69 సగటుతో 1,250 పరుగులు చేసి కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇక శ్రీలంక దిగ్గజ ఆటగాడు సంగక్క 404 ఇన్నింగ్స్‌లో 14234 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
Read Also: జుజిత్సు క్రీడాకారిణి రోహిణి ఆత్మహత్య..

