అంతర్జాతీయ జుజిత్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం(Rohini Kalam) ఆత్మహత్య చేసుకున్నారు. రాధాగంజ్లో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఆత్మహ్యకు గల కారణాలు ఏంటి? అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ అంశంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోహిణి.. అష్టాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ కోచ్గా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం కూడా అంతా బాగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆమెకు ఏదో ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రోహిణి బయటకు రాలేదని తెలిపారు.
ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆమె చెల్లి.. తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. రోహిణి(Rohini Kalam) విగతజీవిగా కనిపించిందని చెప్పారు. అసలు ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? అన్న అంశంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఆమెకు ఎవరో ఫోన్ చేశారు? ఏం జరిగింది? అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే 2024లో అబుదాబి వేదికగా జరిగిన జుజిత్సు పోటీల్లో రోహిణి.. కాంస్య పతకం సాధించారు. ఆమెకు కడుపులో కణితి ఉండగా ఇటీవల వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.

