epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సంయుక్త కూడా ఆ లిస్ట్‌లో చేరిందా..?

కలం, సినిమా: మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) 2016లో మలయాళ చిత్రమైన పాప్‌కార్న్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత 2018లో తమిళ చిత్రం కలరి ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం 2022లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ద్వారా జరిగింది. అదే ఏడాది విడుదలైన బింబిసార సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అదే సంవత్సరం గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ విధంగా నాలుగు భాషల్లో తన టాలెంట్ చూపించింది.

ఇటీవల తెలుగులో అఖండ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారీ మూవీతో వస్తుంది. ఈ సినిమాతో సక్సెస్ సాధించి ఫామ్ లోకి రావాలి అనుకుంటుంది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఈ అమ్మడు మనసులో మాటలను బటయపెట్టింది. ఇంతకీ ఎవరి గురించి చెప్పిందంటారా.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి. విజయ్ సేతుపతితో పూరి తెరకెక్కిస్తున్న మూవీలో సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో టైటిల్ అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారు.

అయితే.. సంయుక్త మీనన్ ఏం చెప్పిందంటే.. తన ఇప్పటి వరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ లో పూరి బెస్ట్ అని.. తన కెరీర్ లో బెస్ట్ డేస్ అన్నీ పూరి జగన్నాథ్ షూటింగ్ లోనే జరిగాయని అంటోంది. ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ వేరే లెవల్ అంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది. వరుసగా ఫ్లాప్ లో ఉన్న పూరి.. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ సినిమాతో పూరి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Samyuktha Menon
Samyuktha Menon

Read Also: అనిల్ రావిపూడి నెక్స్ మూవీ ఎవరితో?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>