కలం వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధర (MSVPG Ticket Price) పెంపు మెమో విచారణ వాయిదా పడింది. సంక్రాంతి(Sankranti) నేపథ్యంలో కోర్టుకు సెలవులు ఉన్నందున ఈ పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. సెలవుల అనంతరం ఈ పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు తెలిపింది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో (TG High Court) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
దీనికి ముందు సినిమాల టికెట్ ధర పెంపుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారీతిన ఎందుకు ధరలు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే పలుమార్లు సీఎం, మంత్రులు ఇకపై టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వబోమని చెప్పారు. కానీ, మళ్లీ పాత పద్ధతిలోనే అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులోనూ ఒక్కో సినిమాకు, ఒక్కో హీరోకు ఒక్కోలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Read Also: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ శౌర్యయాత్ర
Follow Us On: X(Twitter)


