కలం వెబ్ డెస్క్ : అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Mandir) సెక్యూరిటీ ప్రాంతంలో ఒక కాశ్మీరీ వ్యక్తి నమాజ్ (Namaz) చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఆలయం పరిసరాల్లో సీతాదేవి రసోయి వద్ద నమాజ్ చేస్తుండగా సెక్యూరిటీ అధికారులు సదరు వ్యక్తిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయోధ్యలో సంక్రాంతి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ సెక్యూరిటీ కళ్లుగప్పి ఆ వ్యక్తి గేట్ డీ 1 ద్వారా లోపలికి ప్రవేశించాడు. అధికారులు అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు ఒక మతానికి చెందిన వ్యక్తులు సాయం కోరుతూ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. సదరు వ్యక్తి ఇటీవల ప్రయాణ వివరాలు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడనే కోణంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు అతడి కుటుంబ సభ్యులు తన మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులకు వెల్లడించారు.

Read Also: సంక్రాంతికి వెళ్లే వాహనాలతో నిండిపోయిన టోల్‌ప్లాజాలు!
Follow Us On: Instagram


