బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అవ్వాలంటే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్(Arvind Dharmapuri) రాజీనామా చేయాలన్నారు కవిత. అంతేకాకుండా కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి, మంచి నాయకుడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదని కవిత(Kavitha) అన్నారు. కానీ కొందరు కారణంగా కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పైన కూడా విమర్శలు చేశారు కవిత. అనుకోకుండా కాంగ్రెస్‌కు అధికారం వచ్చిందని, కానీ దాన్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ‘‘ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ కచ్చితంగా మంచి సీఎం, మంచి నాయకుడు. కానీ కొంతమంది కారణంగా ఆయనకు చెడ్డ పేరు వస్తోంది. బీఆర్ఎస్ ను గానీ, కేసీఆర్‌ని గానీ ఇష్యూ బేస్డ్ గా మాత్రమే విమర్శిస్తా. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపారు.
‘‘ఇక్కడున్న బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్లే. గతంలో మాధవ నగర్ బ్రిడ్జి గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు రెండేళ్లు అయిన సరే బ్రిడ్జి పనుల్లో పురోగతి లేదు. గతంలో కే ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి లేదా మోడీ తో మాట్లాడి బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలి. బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో అర్వింద్ రాజీనామా చేయండి. అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుంది. మీరు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలి పోతారు. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీ లో ఉంది. మీరు రిజైన్ చేస్తే బిల్లు కచ్చితంగా అవుతుంది’’ అని కవిత(Kavitha) వెల్లడించారు.

