కలం, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) లో యూపీ వారియర్స్‌ని గుజరాత్ జయింట్స్ చిత్తు చేసింది. 10 పరుగుల తేడాతో యూపీ ఓడిపోయింది. శనివారం నవీ ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దిష్ట 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓటమిపై యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ సానుకూలంగా స్పందించారు.
గెలుపుతో టోర్నీని స్టార్ట్ చేయాలనుకున్నా సాధ్యపడలేదని అన్నారు. కానీ ఒక్క ఓటమి ఏం డిసైడ్ చేయదని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ ఆష్లే గార్డనర్ 41 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించారు. అరంగేట్రం మ్యాచ్ ఆడిన అనుష్క శర్మ 30 బంతుల్లో 44 పరుగులు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోఫీ డివైన్ 20 బంతుల్లో 38 పరుగులు చేసి గుజరాత్ 200 మార్కును దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ చివరి వరకు పోరాడి 8 వికెట్లు కోల్పోయి 197 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ ఓటమిపై మెగ్ లానింగ్ స్పందించారు. “మేము గెలుపుతో సీజన్ ప్రారంభించాలని అనుకున్నాం, కానీ ఫలితం మనకివ్వలేదు. గుజరాత్ బ్యాటర్లు చాలా బాగా ఆడారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలర్లకు సవాల్ ఏర్పడింది” లానింగ్ అన్నారు. “మా ప్లాన్స్ అమలు చేయడంలో కొన్ని చోట్ల తడబడ్డాం. మా ఓటమికిపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే మా బౌలింగ్ విభాగం బలంగా ఉంది. సోఫీ ఎక్లెస్టోన్ గేమ్ ప్లాన్‌ను చక్కగా అమలు చేస్తుంది. గతంలో ఆమెతో ప్రత్యర్థిగా ఆడిన అనుభవం ఉన్నా, ఇప్పుడు ఆమెతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది” అని మెగ్ లానింగ్ అన్నారు.
Read Also: ఆ తడబాట్ల వల్లే ఓడిపోయాం : మెగ్ లానింగ్
Follow Us On: Sharechat


