కలం, వెబ్ డెస్క్ : ఫోన్.. ఒక్క పదినిమిషాలపాటు మనతో లేకపోతే ఏదో కోల్పోతున్నామనేంత బాధ! పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ దాని చుట్టే మన ప్రపంచం!! అంతలా మనతో కనెక్ట్ అయిన సెల్ ఫోన్‌ను.. మన దేశ రక్షణ రంగంలో కీలక వ్యక్తి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అసలు వాడనే వాడరట! ఆయన దగ్గర ఫోన్ ఉండదట!! ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. తనకు ఫోన్ తో అవసరం రాలేదని.. కమ్యూనికేషన్ కోసం వేరే మార్గాలను అనుసరిస్తానని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్ –2026’ (Vikasit bharat young leaders dialogue) వేదికపై యూత్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. “ప్రస్తుత హై టెక్ యుగంలో మీలాంటి వారు ఫోన్ వాడరంటే నమ్మలేకపోతున్నాం. నిజమా సార్! మీరు ఫోన్ వాడరా?!” అని యూత్ అడుగగా.. ‘‘ఆ విషయం మీ వరకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ.. నేను ఫోన్ వాడనన్న మాట మాత్రం వాస్తవం” అని అజిత్ దోవల్ ఒప్పుకున్నారు.

Read Also : “జన నాయగన్” వాయిదా.. రీరిలీజ్‌తో పొంగల్ బరిలోకి
Follow Us On : Twitter


