epaper
Tuesday, November 18, 2025
epaper

బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది: కవిత

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్‌పై తెలంగాణ జాగృతి కవిత(Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్(Mopal) మండలం బైరాపూర్ గ్రామంలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కవిత మాట్లాడుతూ.. జూబ్లీ ఉపఎన్నికపై తాము ఇంకా ఒక స్టాండ్ తీసుకోలేదన్నారు. ‘‘అందరి తెలంగాణ కావాలి.. కొందరి తెలంగాణ కావొద్దు అనేది మా లక్ష్యం. బీఆర్‌ఎస్‌ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో నాకు తెలియదు. పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. నేను నా రాజీనామాకు కట్టుబడి ఉన్నా’’ అని కవిత తెలిపారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్యయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతాం… ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు ధైర్యం చెప్పారు.

‘‘తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం. కానీ అది చేసుకోలేకపోయాం. రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టను అని చెప్పారు. అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి. ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం. ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నా. అదే విధంగా ఇక్కడి 9 తండాలు, 3 గ్రామ పంచాయితీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని అన్నారు.

‘‘ప్రాజెక్ట్ కట్టబొమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే. మిగతా పట్టా ల్యాండ్ ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. చేతికొచ్చిన పంటపై విషం చల్లటమంటే ఎంత దారుణం? ఎంత అన్యాయం ఇది? రైతు ఎంత ఆగమైతడు? రైతులను పంట కోసుకొనివ్వచ్చు కదా? ఇంత నిరంకుశంగా, కర్కషంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలి. ఇంత దారుణంగా ఉండటం అన్యాయం. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్లు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

‘‘జిల్లా ఎమ్మెల్యేలను కూడా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం. వాళ్లు ఒప్పుకోకపోతే పోరాటం తప్పదు. ఆత్యహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రకాష్ గారు అలాంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్న. ఆత్మహత్యల వంటి ఆలోచనలు వద్దు. ధైర్యంగా ఉండండి మేమంతా మీకు అండగా ఉంటాం. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నందున అది మీ హక్కు. ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించుకుందాం’’ అని Kavitha అన్నారు.

Read Also: కర్నూలు బస్సు ప్రమాదం.. 12 మృతదేహాలు అప్పగింత

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>