epaper
Tuesday, November 18, 2025
epaper

కర్నూలు బస్సు ప్రమాదం.. 12 మృతదేహాలు అప్పగింత

కర్నూలు(Kurnool) శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో 12 మంది మృతదేహాలను కుటుంబ సభ్యలకు అధికారులు ఆదివారం అప్పగించారు. కాగా, మరో 6గురు మృతదేహాలను అప్పగించడం కోసం బంధువుల రాకకోసం వేచిచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీహార్‌కు చెందిన అమత్‌కుమార్ అనే వ్యక్తికి కర్నూలులోనే అంత్యక్రియలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా మరోకరి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

Kurnool | ఈ క్రమంలోనే ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్నేహితుడు శివశంకర్‌పై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శివశంకర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఉలిందకొండ పోలీసులు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డు మీద పడిందని, కాగా ఎర్రిస్వామిని స్వగ్రామంలో వదలడానికి తీసుకెళ్తూ ప్రమాదంలో శివశంకర్ మరణించాడని ఎర్రిస్వామి వెల్లడించారు. రోడ్డు మీద పడ్డ బైక్‌ను ఒక వాహనం ఢీకొట్టడంతో నడిరోడ్డు పైకి వచ్చిందని, దానిపై నుండి బస్సు వెళ్ళడంతో మంటలు చెలరేగాయని ఎర్రిస్వామి వివరించాడు.

Read Also: సల్మాన్‌ఖాన్‌ ఓ ఉగ్రవాది.. ప్రకటించిన పాక్..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>