కలం, వెబ్ డెస్క్ : గతంలో దేశ చరిత్రపై జరిగిన అణచివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువతనుద్దేశించి ప్రసంగించారు. మన చరిత్ర కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి యోధుల ధీరత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని సూచించారు. మన దేశ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. దేశ సరిహద్దుల్లోనే కాకుండా.. గతంలో చరిత్రపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని తెలిపారు.
చరిత్ర చూసి యువత నేర్చుకోవాలని.. మన స్వేచ్ఛ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. చరిత్రలో అనేక దేశాలు భారత్ పై దాడిచేసి ఆలయాలు, గ్రామాలను ధ్వంసం చేసినప్పటికీ మన పూర్వీకులు ఇతర దేశాల ప్రజలకు ఎలాంటి హానీ కలిగించలేదని గుర్తు చేశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఇబ్బంది కలిగించకుండా ప్రగతీశీల సామాజం వైపు అడుగులు వేయాలని సూచించారు. గతంలో జరిగిన అన్యాయాలకు, హానికి ప్రతీకారంగా బలమైన, స్వాభిమాన భారత్ ను నిర్మించాలని అజిత్ దోవల్ పిలుపునిచ్చారు.

Read Also: ఒడిశాలో కుప్పకూలిన చార్టెడ్ ఫ్లైట్..!
Follow Us On: Instagram


