కలం, వెబ్ డెస్క్: ‘‘నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది. ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా సరిపోదనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా అధికారులపై రాస్తున్న వార్తల్ని తీవ్రంగా ఖండించారు. తనపై ఏమైనా రాయండి తట్టుకుంటానని, కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మంత్రి కోమటిరెడ్డి అభ్యర్థించాడు.
‘‘మీకు కుటుంబాలు ఉంటాయి కదా? ఆఫీసర్లను బదిలీ చేసే హక్కు సీఎంకే ఉంటుంది. కలెక్టర్ పోస్టింగ్‌లో మంత్రుల జోక్యం, రాజకీయ జోక్యం ఉండదు. కలెక్టర్ల బదిలీలు మంత్రి చూసుకోరు. ఎంతో కష్టపడితే ఐఏఎస్‌లు అవుతారు. నాకు ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయి ఫౌండేషన్ పేరుతొ ప్రజాసేవ చేస్తున్నా. ప్రభుత్వం తరుపున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నా. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘వాస్తవాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్న. ఇకనైన ఇలాంటి వార్తలు రాయడం మానుకోవాలి. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని వదులుకున్నా. నా కొడుకును పోగొట్టుకున్న. కొడుకు పేరుతో ప్రజలకు సేవా చేస్తున్నా. పేద ప్రజలకు సేవ చేస్తున్న నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యడం కరెక్ట్ కాదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచా. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీగా గెలిచా. నన్ను మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. తప్పుడు వార్తలు వేసి ఏం సాధిస్తారు. డీజీపీతో మాట్లాడాం. సమగ్ర విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) అన్నారు.
సోషల్ మీడియాలోని వార్తలు ఖండిస్తున్నాను – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
“Baseless and Malicious”: Minister Komatireddy Venkat Reddy Condemns Social Media Rumors Linking Him to Female Officer#KomatireddyVenkatReddy #Nalgonda #Clarification #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/2zbCragPum— Kalam Daily (@kalamtelugu) January 10, 2026
Read Also: సంక్రాంతి స్పెషల్ బస్సుల్లోనూ ‘మహాలక్ష్మి’ వర్తింపు
Follow Us On: Sharechat


