కలం, సినిమా : సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి మరో వారసుడు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jaya Krishna) “శ్రీనివాస మంగాపురం” (Srinivasa Mangapuram) చిత్రంతో అరంగేట్రం చేస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మహేశ్ బాబు రివీల్ చేశారు. జయకృష్ణకు మహేశ్ తన బెస్ట్ విషెస్ అందించారు. శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్ పోస్టర్ లో జయకృష్ణ యాక్షన్ మోడ్ లో కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నారు. బైక్ పై వస్తూ చేతిలో పిస్టల్ తో జయకృష్ణ ఉన్న స్టిల్‌ను చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లవ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు సగం మేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్నారు.సినిమాలో జయకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది.
లాంఛింగ్ మూవీనే ఇంటెన్స్ యాక్షన్ లవ్ థ్రిల్లర్ కావడంతో జయకృష్ణకు మంచి ఎంట్రీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలు వచ్చేశారు. కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా పరిచయమయి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. జయకృష్ణ ఎంట్రీతో ఈ జనరేషన్ కూడా ఇండస్ట్రీలో ఘట్టమనేని వారి లెగసీనీ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు.

Read Also: సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


