కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ హెరిటేజ్ తో మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) శుక్రవారం అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై తెలంగాణ హెరిటేజ్ విభాగం తరఫున డైరెక్టర్ అర్జున్ రావు కుతాడి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) తరఫున రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అలువాల రవి సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా హిస్టరీ అండ్ టూరిజం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం అంటున్నారు అధికారులు. హెరిటేజ్ పరిశోధనలు, విద్యా కార్యక్రమాలు, సెమినార్లు, టూరిస్ట్ గైడ్ ట్రైనింగ్ లు మరింత బలోపేతం అవుతాయని డైరెక్టర్ అర్జున్ రావు కుతాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ డా.పి.నాగరాజు, ఏడీ మల్లు నాయక్, సూపరింటెండెంట్ రాజు, అధ్యాపకులు డా. పనస రామకృష్ణ, డా. మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


