కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు (MSVG) మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా స్పెషల్ జీవో జారీ చేసింది. మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతోంది. 11న రాత్రి వేసే ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు. అలాగే రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల దాకా టికెట్ ధరపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీ ప్లెక్స్ లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఆ తర్వాత నుంచి నార్మల్ టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక రిలీజ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 5 షోలు వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. చిరంజీవితో పాటు ఇందులో వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. కామెడీ మెయిన్ యాంగిల్ లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీని (MSVG) తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు భారీగా చేశారు. మూవీపై మంచి అంచనాలున్నా.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


