కలం, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) తన సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పంపారు. అనంతరం రాజీనామాకు గల కారణాలు వివరించారు. అవేంటంటే.. జంగా కృష్ణమూర్తి 2005లో టీటీడీ సభ్యుడిగా ఉండగా, ఆయన కోరిక మేరకు అప్పటి ప్రభుత్వం తిరుమల బాలాజీ నగర్లో డొనేషన్ స్కీం కింద స్థలం కేటాయించింది. ఇందులో ట్రస్ట్ పేరుతో గెస్ట్ హౌస్ నిర్మించి, భక్తులకు, ట్రస్ట్‌కు ఇద్దామని జంగా అనుకున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల టీటీడీకి డొనేషన్ ఇవ్వలేకపోవడంతో కుదరలేదు. మళ్లీ గడువు పెంచాలని కోరగా, అనుమతి వచ్చింది.గత వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉండగా, రూ.60లక్షలు డొనేషన్ చెల్లించారు. అనంతరం మారిన పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు జంగా టీటీడీలో చేరారు. దాంతో అప్పటి ప్రభుత్వం అనుమతులు ఆపేసింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జంగా మళ్లీ టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. దీంతోగెస్ట్ హౌస్ నిర్మాణం కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపారు. అయితే, టీటీడీలో సభ్యుల్లో బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మినహా మిగిలిన అందరూ ఓకే చేయడంతో తీర్మానం ప్రభుత్వం వద్దకు చేరింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో హఠాత్తుగా.. ప్రభుత్వానికి వంత పాడే ఓ పత్రికలో గెస్ట్ హౌస్ వ్యవహారంలో జంగా కృష్ణమూర్తికి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన జంగా తనభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, పల్నాడు ప్రాంతంలో బలమైన సామాజిక మద్దతు ఉన్న జంగా కృష్ణమూర్తికి గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. కానీ, అప్పట్లో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి దక్కింది. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న జంగా.. సరిగ్గా 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీటీడీలో చేరారు.

Read Also: ఏదైనా చెడగొట్టడం, పడగొట్టడం తేలిక.. నిర్మించడమే కష్టం : పవన్ కల్యాణ్
Follow Us On : WhatsApp


