కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీ ” ది రాజాసాబ్ “(Rajasaab). భారీ అంచనాలతో ఈ సినిమా నేడు (జనవరి 9) గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే సినిమా చూసిన ప్రేక్షకులకు దర్శకుడు మారుతి షాక్ ఇచ్చాడు. ‘రాజాసాబ్ ‘ ట్రైలర్లో చూపించిన చాలా సీన్లు సినిమాలో లేవని ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రైలర్ లో ప్రభాస్ ఓల్డ్ లుక్లో కనిపించగా మూవీలో ఆ సీన్ ఎక్కడా కనిపించలేదు. సంక్రాంతి సందర్భంగా సీన్స్ యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించేందుకు మూవీ యూనిట్ బిజినెస్ ప్లాన్ వేసిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి తీవ్రంగా నిరాశపరిచారని, పార్ట్ 2 అంటూ సినిమాను మరింత ల్యాగ్ చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Read Also: త్వరలో జాబ్ క్యాలెండర్ : మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On: Twitter


