epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సిరిసిల్లలో మన బలం ఎంత?.. ప్రత్యేక బృందాలతో కేటీఆర్ సర్వే !

కలం, కరీంనగర్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆశావాహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ పార్టీ అర్బన్ లోకల్ బాడీల్లో సైతం పట్టు సాధించడానికి కసరత్తు చేస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మెజార్టీ మున్సిపాలిటీల్లో పట్టు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాత్రం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను పక్కన పెట్టి సిరిసిల్లలో (Siricilla) ప్రత్యేక బృందాలతో సర్వేకు సిద్ధమయ్యారు. సర్వే ద్వారా సిరిసిల్లలో మన బలం ఎంత అనేది తెలుసుకోవడానికి సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక బృందాలతో సర్వే..

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ స్వంత నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీ తన చేజారి పోకుండా కేటీఆర్ చర్యలు చేపట్టారు. వాస్తవానికి సిరిసిల్లలో మన బలం ఎంత తెలుసుకోవడానికి కేటీఆర్ సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రత్యేక సర్వే బృందాలతో సర్వేకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉండగా సిరిసిల్లలో మాత్రమే ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా వార్డుల వారిగా సర్వే చేయిస్తున్నారు. సర్వేలో ఏ వార్డులో ఎవరికీ టికెట్ ఇస్తే గెలుస్తారు, ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారనే విషయాలపై చర్చ జరుగుతుంది. ప్రత్యేక సర్వే బృందాలు ఇంటింటికి తిరిగి వారి అభిప్రాయాలను సేకరించనున్నాయి.

రిపోర్ట్ ఆధారంగా ప్లానింగ్..

సర్వే రిపోర్ట్ ఆధారంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం, బలహీనతలపై కేటీఆర్ (KTR) ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ చేజారినా సిరిసిల్ల నియోజకవర్గానికి గుండెకాయ వంటి సిరిసిల్ల మున్సిపాలిటీ చేజారకుండా చర్యలు చేపడుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీ చేజారితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్లలో బీఆర్ఎస్‌కు భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటిపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. సర్వే రిపోర్ట్ ఆధారంగా సిరిసిల్ల మున్సిపాలిటిపై కేటీఆర్ ప్లానింగ్ చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: ‘క్యూర్, ప్యూర్’ పైనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>