కలం, వెబ్ డెస్క్ : రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ ఏరియాల మీదే ఆధారపడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు భాగాలుగా డిజైన్ చేశామని.. ఈ విభాగాలుగానే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జర్మన్ టెక్నాలజీతో ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ రంగంలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం. 1995 నుంచి 2025 వరకు నిరంతరం కష్టపడటం వల్లే హైదరాబాద్ నేడు ప్రపంచ నగరాలతో పోటీ పడుతోంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని’ సీఎం రేవంత్ వివరించారు.
నేడు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ప్రైవేట్ పెట్టుబుడులు ఎంతో ముఖ్యమని సీఎం రేవంత్ వివరించారు. ‘దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం వాటా తెలంగాణదే. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నాం. ఎంతో మంది మన దగ్గర చదువుకుని ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఈవోలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా పాలసీలు తీసుకొస్తున్నాం’ అంటూ సీఎం రేవంత్ తెలిపారు.

Read Also: పంచాయితీలు కాదు.. నీళ్లే కావాలి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


