కలం వెబ్ డెస్క్ : డ్రగ్స్ కేసులో (Drugs Case) సినీ నటుడు నవదీప్ (Navdeep)కు హైకోర్ట్‌లో ఊరట లభించింది. గతంలో గుడిమల్కాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో పోలీసులు నవదీప్ పేరును చేర్చారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తను డ్రగ్స్ వినియోగించలేదని, తనపై నమోదైన కేసును కొట్టేయాలని, ఎఫ్ఐఆర్లో తన పేరు తొలగించాలని నవదీప్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. నవదీప్ తరఫున హైకోర్ట్ న్యాయవాది సిద్ధార్థ్ వాదనలు వినిపించారు.
నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు చేర్చారని వివరించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం నవదీప్‌పై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 2023లో మాదాపూర్‌లో (Madhapur) పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్ పెడ్లర్‌తో ఈ కేసు మొదలైంది. పోలీసుల విచారణలో ఇద్దరు సినీ ప్రముఖులతో పాటు నవదీప్ పేరు బయటకొచ్చింది. నవదీప్‌పై (Navdeep) కేసు నమోదు కాగానే తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. అప్పట్లో విచారణ చేపట్టిన కోర్ట్ నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా నవదీప్‌పై కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: ‘జననాయగన్’కు బిగ్ రిలీఫ్
Follow Us On : WhatsApp


