కలం, కరీంనగర్ బ్యూరో: అప్పులతో బాధ పడుతున్న ఓ యువకుడు దుబాయ్‌లో ఉన్న తన స్నేహితులకు వీడియో కాల్ చేసి, వారు చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల సంజీవరెడ్డి (31) తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎక్కువ కావడంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంజీవరెడ్డి ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలను స్నేహితులకు చూపించడానికి వీడియో కాల్ చేశాడు. మిత్రుడిని కాపాడడానికి స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే సంజీవ రెడ్డి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కొండగట్టు బాధితులకు సర్కార్ చేయూత..
Follow Us On: X(Twitter)


