కలం వెబ్ డెస్క్ : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay Thalapathy) సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan) సెన్సార్ ఇష్యూ తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే జననాయగన్‌ను అడ్డుకుంటోందని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) దీనిపై స్పందించగా తాజాగా డీఎంకే (DMK) నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు విజయ్ సినిమాను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుందని డీఎంకే నేతలు పేర్కొన్నారు.
సినిమా సర్టిఫికేషన్ సెన్సార్ బోర్డు ద్వారా జరుగుతుందని తెలిపారు. దీంతో డీఎంకేకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ‘జన నాయగన్’ సినిమా విడుదలను ఆలస్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే బీజేపీ పెద్దలు విజయ్ సినిమాపై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది.

Read Also: రాజాసాబ్ లో ఆ సీన్స్ మిస్సింగ్ . . మండిపడుతున్న ఫ్యాన్స్
Follow Us On : WhatsApp


