మహారాష్ట్ర(Maharashtra) దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌పై ఎస్ఐ గోపాల్ బాద్నే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ లాడ్‌పుత్రే వేధింపులకు గురి చేశాడు. వీటిని తట్టుకోలేకపోయిన వైద్యురాలు.. ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్ర – సతారా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌పై 5 నెలల్లో 4 సార్లు అత్యాచారానికి పాల్పడిన ఎస్సై గోపాల్ బాద్నే. లాడ్‌పుత్రే..ఆమెను తీవ్రంగా వేధించాడు. పోలీసుల వేధింపులపై గతంలో లేఖ రాసినా డీఎస్‌పీ పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్యకు పాల్పడింది.
Maharashtra | సతారా ఆసుపత్రి(Satara Hospital)లో బాధితురాలు రెండేళ్ల క్రితమే విధులకు చేరింది. పోస్టుమార్టం, ఫిట్‌నెస్‌లపై నకిలీ నివేదికలు ఇవ్వాలంటూ డాక్టర్‌ను పోలీసులు తీవ్రంగా వేధించారు. ఉన్నతాధికారులకు లేఖ రాసినా పట్టించుకోకపోవడంతో, చేతిపై రాసి సూసైడ్ చేసుకున్న మహిళా డాక్టర్. ఈ ఘటనపై విచారణ చేపట్టి ఎస్సై గోపాల్ బాద్నేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Read Also: ‘పెట్ అండ్ ప్లే పార్క్’ పనులను సీఎం తనిఖీ..

